Monday, December 23, 2024

జమ్మూకశ్మీర్ లో విజయం దిశగా కాంగ్రెస్ కూటమి

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్‌ లో కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ పై భారీ ఆధిక్యం సాధించిన కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం జమ్మకశ్మీర్ కాంగ్రెస్ కూటమి 52 స్థానాల్లో ముందజలో ఉంది. ఇక, బిజెపి 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 46ను దాటేసిన కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు హర్యానాలో బిజెపి సత్తా చాటింది. అక్కడ 49 స్థానాల్లో ముందజలో కొనసాగుతున్న బిజెపి విజయం సాధించే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల్లోనూ 90 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 46 మార్క్‌ దాటాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News