Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు: జానా రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపిని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని కాంగ్రెస్ నేత జానా రెడ్డి తెలిపారు. జానా రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వేటును బిఆర్‌ఎస్‌తో పాటు అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అనేది ప్రజలే నిర్ణయిస్తారని జోస్యం చెప్పారు. దేశంలో పెట్టుబడిదారులకు బిజెపి కొమ్ముకాస్తోందని దుయ్యబట్టారు. ప్రశ్నించినందుకే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. అధికారం కోసం బిజెపి ఆరాచకం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News