Saturday, November 16, 2024

చేయికి చిక్కిన కామ్రేడ్లు

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్,కమ్యూనిష్టుల దోస్తీ
ఇండియాకూటమి ఒప్పందంతో ఇక్కడ పొత్తు
కలిసిపోయేందుకు సిద్ధమైన ఇరుపక్షాలు
మిర్యాలగూడ సిపిఎంకు.. మునుగోడు సిపిఐకి
ఇచ్చే ఛాన్స్
ఆయా నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్న
కమ్యూనిష్టులు
అంతర్మథనంలో కాంగ్రెస్ కేడర్

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో:మునుగోడు ఉపఎన్నికల సమయంలో కమ్యూనిష్టులు గులాబీ పార్టీతో దోస్తానా చేశారు.. ఆపార్టీని గట్టెక్కించారు.. కొంతకాలం కలిసున్నారు.. కానీ ఆతర్వాత జరిగిన పరిణామాలతో కమ్యూనిష్టులతో బిఆర్‌ఎస్ పార్టీ తెగతెంపులు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ పార్టీలు కొన్నిస్థానాలపై పట్టుపట్టడం.. గులాబీపార్టీ ఇచ్చేందుకు ససేమిరా అనడంతో వారి బంధం కట్ అయిపోయింది. అధికార పార్టీపై కామ్రేడ్లు కన్నెర్ర చే స్తూ ఉద్యమాలు చేస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని గద్దెదించేందుకు కొన్నిరాజకీయ పార్టీలతో ఇండియా కూ టమి ఏర్పాటైంది. ఆకూటమిలో కాంగ్రెస్‌తో పాటు కామ్రేడ్లు ఉన్నా రు. అక్కడ కలిసున్న నేతలు తెలంగాణలో కూడా కలిపోవాలనే నిర్ణయానికి వచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిష్టులు పొ త్తుపెట్టుకొని పోటీకి సై అంటున్నారు. కానీ సీట్ల సర్థుబాటు అంశంపైనే తర్జనభర్జన జరుగుతుంది. చివరకు వీరిద్దరి ఒప్పందంలో సిపిఎంకు రెండు.. సిపిఐకి రెండుస్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కు దిరినట్లు చెపుతున్నారు. అలా జరిగితే సిపిఎం, సిపిఐ పార్టీలు ఉమ్మడినల్లగొండ, ఖమ్మం జిల్లాలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని సిపిఎం పార్టీకి.. మునుగోడు స్థానాన్ని సిపిఐ పార్టీకి ఇచ్చేందుకు ఇరుపార్టీలు ఒప్పందానికి వచ్చినట్లు చర్చ జరుగుతుంది. అటు కాంగ్రెస్.. ఇటు కమ్యూనిష్టులు కూడా ఈసీట్లపై సయోధ్య కుదిరినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. త్వరలో కాంగ్రెస్ స్థానాలను ప్రకటించడ ంతో పాటు పొత్తుపై కూడా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అ ంటున్నారు.

పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు బలమైన స్థానాలను క మ్యూనిష్టులకు ఇస్తే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కాంగ్రెస్ కేడర్ అంటోంది. పొత్తులో వారికి కేటాయిస్తే ఏమి చేయాలని కాంగ్రెస్ నేతలు, కేడర్ అంతర్మథనంలో పడిపోయింది. గత ఐ దేళ్ళుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని సేవా కార్యక్రమాలతో మిర్యాలగూడ కాంగ్రెస్ నేత బిఎల్‌ఆర్ ముందుకు పోతున్నారు. ఇ ప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కేడర్ కూడా ఆయన కోసం పనిచేస్తున్నారు. ఈతరుణంలో మిర్యాలగూడను సిపిఎంకు ఇస్తే ఎలా అని మదనపడుతున్నారు. ప్రధానంగా మిర్యాలగూడ కా ంగ్రెస్ టిక్కెట్ కోసం బిఎల్‌ఆర్, జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి పోటీపడుతూ వస్తున్నారు.

అయితే ఈసారి కమ్యూనిష్టులకు కేటాయిస్తే బిఎల్‌ఆర్‌ను పక్కకు పంపినట్లు అవుతుందనే ఉద్ధేశ్యంతోనే కా ంగ్రెస్ కురువృద్ధనేత సిపిఎంకు వచ్చేలా తెరవెనుక ప్రయత్నాలు చే స్తున్నారని కాంగ్రెస్ కేడర్ మండిపడుతుంది. అంతేకాకుండా బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావుకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని హస్తం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలాఉంటే మునుగోడులో కూడా చాలామంది పోటీపడుతుండట ంతో సిపిఐకి ఇస్తే ఇబ్బంది ఉండదనే ఆలోచనకు కాంగ్రెస్ వచ్చిన ట్లు చెపుతున్నారు. పొత్తులో భాగంగా మిర్యాలగూడ సిపిఎంకు ఇస్తే మాజీఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మరోమారు బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మునుగోడు సిపిఐ అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆపార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్, కామ్రేడ్ల పొత్తుతో మిర్యాలగూడ, మునుగోడు నియోజకవర్గాల్లో ఎర్రపార్టీలు పోటీచేయనున్నాయని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News