Sunday, January 19, 2025

ఆ మూడు సీట్లు సిపిఐకి: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికల తరువాత రెండు ఎంఎల్‌సి సీట్లు సిపిఐకి ఇస్తామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐకి కొత్తగూడెం టికెట్ ఇస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు అంశంపై సిపిఐతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. సిపిఐతో పొత్తు ఖరారైందని, చట్టసభల్లో వామపక్షాల ప్రాతినిధ్యం ఉండాలని, ఎఐసిసి అదేశాల మేరకే సిపిఐ ఆఫీసుకు వచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్-సిపిఐ నేతలు కార్యకర్తల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌తో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఎన్‌డిఎ కూటమిని ఓడించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News