Monday, December 23, 2024

కాంగ్రెస్, బిజెపిలు మోసపూరిత పార్టీలు

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: కాంగ్రెస్, బిజెపిలు మోసపూరిత పార్టీలని, సిఎం కెసిఆర్ నాయకత్వం తెలంగాణ భారత దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, సిఎం కెసిఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు చేరుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో రామగుండంలో ప్రగతి దశాబ్ధి ప్రజా చైతన్య యాత్రను చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్‌కు కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డివిజన్‌లోని ప్రతీ ఇంటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ, సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైన విధానాన్ని ప్రజలకు వివరించారు. రాబోయే కాలంలో బిఆర్‌ఎస్‌కు మద్ధతుగా నిలిచి కెసిఆర్ హ్యాట్రిక్ సిఎంగా గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ యాత్రలో కార్పొరేటర్లు అయిత శివ కుమార్, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, బాలరాజ్‌కుమార్, ఇంజపురి పులేందర్, కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, పాముకుంట్ల భాస్కర్, కో ఆప్షన్ సభ్యులు వంగ ఎనివాస్ గౌడ్, చెరుకు బుచ్చిరెడ్డితోపాటు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News