Monday, December 23, 2024

కాంగ్రెస్, బిజెపిలకు అభ్యర్థులు కరువు

- Advertisement -
- Advertisement -
  • రేవంత్ రెడ్డి ఓ చీటర్.. అన్ని పార్టీలను ముంచుతూ వస్తున్నాడు
  • మంత్రి ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
  • 27న జరిగే సిఎం కెసిఆర్ సభను విజయవంతం చేయాలి
  • సభాస్థలిని పరిశీలించిన మంత్రులు

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి ఓ చీటర్ అని.. అన్ని పార్టీలను ముంచుతూ వస్తున్నాడని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలకు ఆ పార్టీ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్ద్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

ఈ నెల 27 మధ్యాహ్నం మానుకోట కేంద్రంలో జరిగే ఎన్నికల ప్రచార సభకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అభ్యర్ధి బానోత్ శంకర్‌నాయక్, జడ్పీ చైర్‌పర్సన్ కుమారి అంగోతు బిందు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బీరవెల్లి భరత్‌కుమార్ రెడ్డిలతో కలసి ఆదివారం సీఎం సభాస్థలిని పరిశీలించి పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలుత మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 70 వేల మందితో సీఎం కేసీఆర్ సభ జరుగుతుందన్నారు.

మహబూబాబాద్ జిల్లాను అన్ని విధాలుగా సీఎం ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ద్ధి పరిచారన్నారు. సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలు పట్టుదలతో ఉన్నారని వెల్లడించారు. అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్, బిజెపిలకు ఇంకా పార్టీ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువైయ్యారని ఎద్దేవా చేశారు. మానుకోట రాళ్లకు ఉన్న పౌరుషం ఆ రెండు పార్టీల నాయకులకు లేదన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన టిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.

శంకర్‌నాయక్‌ను మూడోసారి ఆశీర్వదించాలి..

మానుకోట నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్దిగా తలపడుతున్న బానోత్ శంకర్‌నాయక్‌ను మూడోసారి గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు మానుకోట సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారని మంత్రి తెలిపారు. రాహూల్ గాంధీ సభకు ప్రజలు రాలేదు కాబట్టే రోడ్‌షోలు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. సబ్బండ వర్గాల ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలను అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ మానిఫెస్టోను తెలంగాణ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.

కేంద్రం అనేక ఆవరోధాలు సృష్టించినా రాష్ట్ర ప్రగతి ఆపకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్లిన సిఎం కెసిఆర్‌ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేసేంత వరకు పార్టీ శ్రేణులు విశ్రమించరాదని మంత్రి పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాక్‌రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అద్యక్షుడిగా కొనసాగుతూ టికెట్లు ఇప్పిస్తానంటూ అందినకాడికి దండుకుంటున్నాడని విమర్శించారు. ఇప్పటికీ అనేక చోట్ల పార్టీ అభ్యర్థులు దొరకక అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వారి కోసం ఇంకా ఎదురు చూస్తుండడం కాంగ్రెస్, బిజెపి పార్టీల దయనీయ పరిస్థితులకు నిదర్శనమన్నారు. చీటర్‌గా పేరొందిన రేవంత్‌రెడ్డి అన్ని పార్టీలను ముంచుతూ వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మాయమాటలు చెపుతూ తెలంగాణలో అధికారంలోకి రావాలని పగటికలలు కంటుందన్నారు.

ఎదైనా మళీ ప్రజల మనిషి కేసీఆర్ మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించబోతున్నారని మంత్రి జోస్యం చెప్పారు. ఇంకా కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్, గద్దె రవి, గోగుల రాజు, గుండా రాజశేఖర్, సుదగాని మురళీ, నాయిని రంజిత్, మందుల రఘు, యాళ్ల మురళీధర్‌రెడ్డి. పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News