Wednesday, January 22, 2025

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల నియామకంతో కాంగ్రెస్, బిజెపి రహస్య మైత్రి బట్టబయలైంది : హరీశ్‌ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్‌సిల నియామకంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య ఉన్న రహస్య  మైత్రి బయటపడిందని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆరోపించారు. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గతంలో తమ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను గవర్నర్ ఎంఎల్‌సిలుగా నియమించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే తమిళిసై ఆమోదించారని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు ఒక్కటై బిఆర్‌ఎస్‌ను అణగదొక్కాలని చూస్తున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం దురదృష్టకరమన్నారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని చెప్పారు. కానీ గులాబీ పార్టీకి, హస్తం పార్టీకి మధ్య తమిళిసై తేడా చూపిస్తున్నారని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News