Saturday, January 11, 2025

తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిల ఆటలు చెల్లవు : అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో మజ్లిస్ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మజ్లిస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి స్పందించారు. రాష్ట్రంలో ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్‌సి, ఎస్‌టిలకు అమలు చేస్తామన్న బిజెపి నేతల వ్యాఖ్యలను అసదుద్దీన్ తప్పుపట్టారు. మతపరమైన రిజర్వేషన్‌లని బిజెపి అబద్ధాలు చెబుతోందని విమర్శించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముస్లింలు తమ మతం ఆధారంగా కాకుండా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన నేపథ్యంలో రిజర్వేషన్లు పొందుతున్నారని, వెనుకబడిన ముస్లింల కోసం రూపొందించబడిన జాబితా ప్రకారమే రిజర్వేషన్ పొందుతున్నారని ఒవైసీ స్పష్టం చేశారు. రాష్టంలో రాజకీయంగా ఎంఐఎం బలపడటంతో కాంగ్రెస్, బిజెపిలు తమను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆరి ఆటలు రాష్ట్రంలో చెల్లవని, కాంగ్రెస్, బిజెపిలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపిలు విభజన, విద్వేష రాజకీయాలు చేస్తున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. టిపిసిసికి ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి నాయకుడిగా ఉన్నాడని, రాష్ట్ర కాంగ్రెస్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని అసదుద్దీన్ ఆరోపించారు. తెలంగాణలో మైనారిటీలను ఎలా ఇబ్బంది పెట్టాలా? అని ఆ పార్టీలు చూస్తున్నాయని, రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగనీయబోమని ఓవైసి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News