Friday, November 15, 2024

బిసిలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్,బిజెపిలు విఫలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో గత 75 ఏళ్లుగా బిసిలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్,బిజెపి పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ బిసిలకు 60 నుంచి 70 సీట్లు కేటాయిస్తుందని తెలిపారు. దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు ఏం ఒరగపెట్టలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏం సాధించిందని సభ నిర్వహిస్తుందో ప్రజలకు తెలపాలన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు పేదరికాన్ని నిర్మూలించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. పాలేరు జలాశయం ద్వారా నియోజవర్గంలోని సాగు భూములకు నీరందడంలేదన్నారు. జలాశయం ఆయకట్టు కింద ఉన్న వేల ఎకరాలు బీడు భూములుగా మారాయన్నారు. ఎస్సారెస్పీ కాల్వలు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే 30 శాతం కమిషన్ తీసుకుని అనర్హులకు దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు పక్కా భవనాలు నిర్మించడంలో అధికారులు విఫలమైయ్యారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 ను తమ పార్టీ అధ్వర్యంలో తెలంగాణ పునర్విముక్తి దినంగా జరుపుతున్నట్లు ప్రకటించారు. ఈకార్యక్రమంలో పార్టీ ఇంచార్జ్ అల్లిక వెంటేశ్వర్ రావు యాదవ్ అధ్యక్షతగా వహించగా పార్టీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్,రాష్ట్ర కో ఆర్డినేటర్ గొల్ల సతీష్ ,డా. సాంబశివ గౌడ్,జిల్లా అధ్యక్షులు బర్రా ఉపేందర్ సహూ,మంజుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News