Monday, December 23, 2024

ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది గులాబి దళంలో చేరడం రివాజుగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ నమ్మకంతోనే గురువారం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 40 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, మండల పార్టీ కన్వీనర్ ఊడ్గుల ప్రవీణ్‌గౌడ్, నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డుసభ్యులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News