Wednesday, January 22, 2025

ప్లాట్ల బాధితులకు కాంగ్రెస్, బిజెపి మద్దతు

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసి మోససోయిన బాధితులకు శుక్రవారం బిజెపి,కాంగ్రేస్ పార్టీలు మద్దతు తెలిపాయి.గత మూడు రోజులుగా న్యాయం చేయాలంటూ బాలాజీనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన రిలే దీక్షలు చేస్తున్న బాధితులను జవహర్‌నగర్ కాంగ్రేస్,బిజెపి పార్టీలు మద్దతు తెలిపి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు.ఈ సందర్భంగా కాంగ్రేస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్‌యాదవ్,బిజెపి అధ్యక్షుడు రంగుల శంకర్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 613,614లలో 62 మంది ప్లాట్లు కొనుగోలు చేయగా ఆ స్థలంలో కెసిఆర్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మంత్రి మల్లారెడ్డి ప్లాట్ల బాధితులకు న్యాయం చేస్తానని గత 4 సంవత్సరాలుగా తన చుట్టూ తిప్పించుకోని న్యాయం చేయకుండా నేడు వారిని రోడ్డున పడేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.తెలంగాణ ప్రభుత్వంలో దళితులకు మూడేకరాల భూమి ఇస్తామని చెప్పిన సీఎం కెసిఆర్ నేడు జవహర్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డి దళితులను మోసం చేయడం సిగ్గుచేటన్నారు.ప్లాట్లు అమ్మిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోని బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News