Friday, December 20, 2024

దేశానికి దండగ కాంగ్రెస్, బిజెపి: మంత్రి కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్, బిజెపి పార్టీలు దేశానికి ఎప్పటికీ దండగేనని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజలకు బిఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినప్పటికీ రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ మంత్రి కెటిఆర్ గురువారం ట్వీట్ చేశారు.

జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నం., పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వకున్నా, దిగ్గజ ఐటి కంపెనీలన్నీ తెచ్చుకున్నామన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా, మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు బిఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, దేశానికి బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటికీ దండగేనని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News