Monday, January 27, 2025

కాంగ్రెస్, బిజెపిల నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీగా మారిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పల మండలం, రాయపర్తి మండల్లాల్లోని పలువురు కాంగ్రెస్, బిజెపిల కార్యకర్తలు నేడు హనుమకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. బిఆర్ఎస్ లోకి వస్తున్న కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఏకైక ధ్యేయంగా పనిచేస్తున్న భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. పార్టీ కార్యకర్తలను అన్ని విధాల కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింతగా ప్రజలకు తీసుకెళ్ళేందుకు పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో దేవరుప్పల మండలం, లకావతి తండా గ్రామ పంచాయతీ నుంచి లకావతి రవి, శ్రీను, బబ్లు, శ్రీనివాస్, దేవుని గట్ట తండా నుంచి బానోత్ బన్సి, వావిలాల్, రమేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, పాలకుర్తి దేవస్థాన కమిటీ సభ్యులు సత్తయ్య తదితరులు ఉన్నారు. దేవరుప్పుల మండలంలో గౌడ సంఘం కోసం మినీ ఫంక్షన్ హాల్ కావాలని కోరుతూ గౌడ సంఘం అధ్యక్షులు కారుపోతుల యాదయ్య ఆధ్వర్యంలో ఆకుల అంజయ్య గొడిశాల మల్లేష్, యాదయ్య, గొడిశాల నరసయ్య, గొడిశాల యాకయ్య, ఆకుల మల్లయ్య, దాట్ల యాకన్న ,అంబాల యాకన్న ,కార్పోతుల అనిల్, బండి శ్రీహరి, ఎరుకల అశోక్, గోడిశాల దశరథ్ తదితరులు మంత్రిని కలిశారు.

వెంటనే మినీ ఫంక్షన్ హాల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.

రాయపర్తి మండలం, కాట్రపల్లి గ్రామం నుండి బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుంచి గౌడ సంఘం అధ్యక్షుడు కోలుకోండ రాములు, పెద్దమనుషులు గుండ్లపల్లి కిష్టయ్య, గుండ్లపల్లి యాకయ్య, గుండ్లపల్లి భాస్కర్, గుండ్లపల్లి మధు, గుండ్లపల్లి అశోక్, గుండ్లపల్లి సోమయ్య, గుండ్లపల్లి నారాయణ, ఐలయ్య యాదగిరి, రాజు టిఆర్ఎస్ పార్టీలో మంత్రి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల శ్రీధర్, సర్పంచ్ ఎల్లయ్య, గ్రామ కార్యదర్శి అన్వర్, పార్టీ నాయకులు యండి గుంషావళి, రాంపెల్లి రాజాలు, గుమ్మడిరాజు శ్రీను, చెనబోయిన యాకయ్య కత్తి సోమన్న , గిరుక సురేష్, తదితరులు ఉన్నారు. రాయపర్తి మండలం, కాట్రపల్లి గ్రామంలో గౌడ్స్ కులదైవం కాటమయ్య దేవాలయం నిర్మించాలని మంత్రిని కోరగా… ఆ దేవాలయ నిర్మాణానికి అన్ని విధాల సాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News