Tuesday, March 25, 2025

కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల పాత బంధం బయటపడింది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి, కెటిఆర్ కలిసి దుష్ప్రచారం చేస్తూ.. లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జరిగిన చెన్నై సదస్సులో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయన్నారు. ఈ సదస్సుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ పాత బంధం బయటపడిందని అన్నారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.

దేశంలో లేని సమస్యను సృష్టించి బిజెపి, కేంద్రానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ విధివిధానాలపై ఇంకా చర్చనే జరగలేదని చెప్పారు. ఇప్పటివరకూ డీలిమిటేషన్‌పై ఉన్న చట్టాలు చేసి కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేయడం సరికాదని.. డీలిమిటేషన్‌పై కేంద్ర ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News