- Advertisement -
చెన్నై: తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లను డిఎంకె కేటాయించింది. కన్యాకుమారి లోక్ సభకు జరిగే ఉపఎన్నిక స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఒప్పదం కుదిరినట్లు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు అళగిరి తెలిపారు. త్వరలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. బెంగాల్ లో బిజెపి, టిఎంసిల మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
Congress and DMK seat-sharing deal in Tamil Nadu
- Advertisement -