Monday, January 20, 2025

జార్ఖండ్ లో 70 సీట్లకు పోటీచేయబోతున్న కాంగ్రెస్, జెఎంఎం

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్ లో మొత్తం 81 సీట్లలో కాంగ్రెస్, జెఎంఎం కలిసి 70 సీట్లకు పోటీచేయబోతున్నాయి. కాగా మిగతా 11 సీట్లను తమ ఇండియా బ్లాక్ సంకీర్ణ భాగస్వాములైన ఆర్ జెడి, వామపక్షాలకు కేటాయించబోతున్నారు. ఈ విషయాన్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ శనివారం తెలిపారు.

జార్ఖండ్ లో 81 సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా నవంబర్ 13, 20న జరుగనున్నాయి.కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగనున్నది.జార్ఖండ్ లో ఇండియా బ్లాక్ అసెంబ్లీ ఎన్నికలకు కలిసి పోటీచేయబోతున్నది.  మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపాక అభ్యర్థులను ప్రకటించబోతున్నారు.

ఇక ఎన్ డిఏ కూటమి విషయానికి వస్తే…బిజెపి 68 సీట్లలో పోటీచేయబోతున్నది. కాగా ఏజెఎస్ యు పార్టీ 10, జెడి(యు) 2, ఎల్ జెపి (రామ్ విలాస్) 1 సీటుకు పోటీ చేయబోతున్నాయి.  నామినేషన్లను అక్టోబర్ 25 వరకు దాఖలు చేయవచ్చు. జార్ఖండ్ లో ఈసారి 2.60 కోట్ల మంది ఓటర్లు ఓటేయబోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News