Sunday, December 22, 2024

మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఖరారు

- Advertisement -
- Advertisement -

లోక సభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో 57 మంది ఎంపి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇక, తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఎంపి అభ్యర్థులను ఖరారు చేసింది ఎఐసిసి. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, పట్నం సునీత మహేందర్ రెడ్డిలకు చోటు దక్కింది.

ఇందులో మల్కాజ్ గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డిలను ఎంపిక చేశారు.

కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి నాలుగురు ఎంపి అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. జహీరాబాద్‌ నుంచి సురేశ్‌ కుమార్‌ షెట్కర్‌, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ లను ఎంపిక చేశారు. ఇక.. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News