Saturday, April 5, 2025

రూ.500కే వంటగ్యాస్.. ఇంటి యజమానురాలికి రూ.10వేలు: కాంగ్రెస్ హామీలు

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ గెలుపొందితే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, ఇంటి యజమానురాలికి ఏటా రూ.10 వేలు గౌరవ భృతి అందిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హామీలు గుప్పించారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ 1.05 కోట్ల కుటుంబాలకు అందుతుందని ప్రకటించారు.

ఝుంఝునులో కాంగ్రెస్ ర్యాలీని ఉద్దేశించి బుధవారం గెహ్లాట్ ప్రసంగించారు. గృహలక్ష్మి గ్యారంటీ కింద ఇంటి యజమానురాలికి ఏటా రూ.10 వేలు గౌరవ భృతి కల్పిస్తామని చెప్పారు. రాజస్థాన్ లోని 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News