Monday, January 20, 2025

కర్నాటక కాంగ్రెస్ యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.ఎన్. చంద్రప్ప!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో జరుగనున్నాయి. దీనికి ముండు కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.ఎన్.చంద్రప్పను ఆదివారం నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. కర్నాటక యూనిట్‌కు డి.కె.శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. ధ్రువనారాయణ గత నెల కాలధర్మం చెందడంతో చంద్రప్పను నియమించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 142 మంది అభ్యర్థులను ప్రకటించారు. కర్నాటకలో బిజెపి నుంచిఅధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 224 మంది సభ్యులు ఉండే కర్నాటక శాసన సభకు మే 10న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలను మే 13న ప్రకటిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News