Friday, November 15, 2024

మణిపూర్ బిజెపి ఎంపిని మాట్లాడనివ్వరెందుకు: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కొందరు కేంద్ర మంత్రులు లోక్‌సభలో మాట్లాడారే కాని మణిపూర్‌కు చెందిన బిజెపి ఎంపి, కేంద్ర సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్‌కు మాట్లాడే అవకాశాన్ని అధికార పార్టీ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ గురువారం ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మొదటి రెండు రోజులు తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగింది. మణిపూర్‌లో హింసాకాండకు కేంద్రమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష సభ్యులు నిందించగా అవినీతి, వారసత్వ రాజకీయాలపై అధికార పక్షం ప్రతిపక్ష సభ్యుల మీద విరుచుకుపడింది. ఇప్పటివరకు కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, కిరణ్ రిజిజు తదితరులు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అవిశ్వాస తీర్మానానికి జవాబు ఇవ్వనున్నారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో కొందరు మంత్రులు మాట్లాడారని, అయితే మణిపూర్ ఇన్నర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కేంద్ర సహాయ మంత్రి, బిజెపి ఎంపి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఎందుకు మాట్లాడలేదని జైరాం రమేష్ ప్రశ్నించారు. మణిపూర్ హింసాకాండలో డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఇల్లు కూడా దగ్ధమైందని, మణిపూర్ తరఫున పార్లమెంట్‌లో మాల్టాడే అవకాశాన్ని బిజెపి ఆయనకు ఎందుకు ఇవ్వలేదని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News