Sunday, December 22, 2024

ముగ్గురిపై కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడి…. పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

గాంధారి: నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం గండిపేట గ్రామంలో శనివారం రాత్రి ముగ్గురు బిఆర్ ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడి చేశాడు. సామాజిక మాధ్యమంలో ఒక గ్రూప్ అడ్మిన్ నెంబర్ ను తొలగించడంతో ఘర్షణ ప్రారంభమై చివరకు కత్తిపోట్లకు దారితీసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం…. గండిపేట గ్రామానికి చెందిన బీమ్ దాస్ అదే గ్రామానికి చెందిన హైమద్, రజాక్, జావేద్ లను తన గ్రూప్ లో నుండి వారి నంబర్లను తొలగించడంతో వారు బీమ్ ను ప్రశ్నించారు‌‌. ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. బీమ్ దాస్ తన వద్దనున్న కత్తితో ముగ్గురిపై దాడి చేశాడు.

గాయపడిన ముగ్గురిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఛాతీపై గాయాలైన హైమద్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ పడినవారు గతంలో ఒకే పార్టీకి చెందినవారుగా గ్రామస్తులు తెలిపారు. దాడికి పాల్పడిన బీమ్ దాస్ ను అదే పార్టీకి చెందిన కార్యకర్తలు చితకబాడడంతో అతడిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ఎల్లారెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News