Saturday, January 18, 2025

గ్రేటర్‌లో పట్టుకోసం కాంగ్రెస్ యత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గ్రేటర్ వ్యాప్తంగా కేవలం మూడు కార్పొరేటర్ స్థానాలను గెలుపొంది నామకే వాస్తే అన్నట్లుగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ అసెంంబ్లీ ఎన్నికల ద్వారా గ్రేటర్ లో తమ పూర్వ వైభావాన్ని చాటేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటీకే ఎన్నికల షెడ్యూల్ వెలువడడం, ఎన్నికలకు కేవలం 50 రోజులు మాత్రమే మిగిలిన్నప్పటికీ ఇప్పటీ వరకు కూడ అభ్యర్థులు ఎవరనేది ఖరారు కాకపోవడంతో టికెట్ ఆశావాహులతో పాటు ఆ పార్టీ క్యాడర్‌లో సైతం పూర్తి అయోమయం నెలకొంది.

ఒకవేళ రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల జాబితాను అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో టికెట్‌ను అశిస్తుండడంతో టికెట్ రాని వారి తిరుగు బాటు మరో తలనొప్పి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో వారిని బుజ్జగించి దారికి తెచ్చుకునే లోపే నవంబర్ 3వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ సైతం వెలువడనుంది. అయితే ఈ సమాయానికే అధికార బిఆర్‌ఎస్ పార్టీ రెండవ దఫా ప్రచారం కూడ పూర్తి చేసేలా ప్లాన్‌ను సిద్దం చేసుకుంది. నామినేషన్ల ప్రక్రియ 10తో ముగిసినప్పటీకీ స్క్రూటీ, ఉపసంహరణ గడువు అంతా నవంబర్ 15 నాటికి పూర్తి కానున్నాయి.

నవంబర్ 30న పోలింగ్ కావడం, 48 గంటల ముందే అన్ని పార్టీలు ప్రచారం ముగించాల్సి ఉండడంతో మిగిలిన ఆ 12 రోజేలే కాంగ్రెస్‌కు కీలకం కానున్నాయి. అయితే పూర్తిగా అధిష్టానం పెద్దలే నమ్ముకున్న టి కాంగ్రెస్ నాయకులు ఈనెల 16 నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాంధీ, అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలతో బస్సు యాత్ర ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు అంతా సిద్దం చేసుకుటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News