Thursday, January 23, 2025

అబద్ధాలతో కాంగ్రెస్ అధికారం కోసం ప్రయత్నాలు: రఘనందన్‌రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, అధ్యక్షులు అబద్ధాల పునాదుల మీద అధికారం లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే రఘనందన్‌రావు ఆరోపించారు. బిజెపి మీద బట్ట కాల్చి పడేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఎంపీలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టీ లిక్కర్ కేసులో మూలాలు ఆంధ్ర, తెలంగాణకు ఉన్నాయని పేర్కొంటున్నారని ఈడి, సిబిఐ మీ జేబు సంస్థా? అంటూ నిలదీశారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిడబ్య్లూసి సమావేశం నుంచి కొత్త కొత్త అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కవిత అరెస్ట్ అవుతుందని రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని… ఈడి, సిబిఐలు మీ జేబు సంస్థలా? మీకు సమాచారం ఎట్లా వచ్చిందని మండిపడ్డారు.

అప్రూవర్‌గా మారిన దాంట్లో మీ చుట్టాలు ఉన్నారు కదా? ఆయన చెప్పాడా? వాళ్ళు మీకు చెప్పారా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్న.. మీకు సమాచారం ఎట్లా వచ్చింది? ఢిల్లీ కేసుల గురించి మాట్లాడుతున్నారు, మరి గల్లీ కేసులు ఎందుకు మాట్లాడుతలేరని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఎందుకు ట్రయల్ నిర్వహిస్తాలేదు, ప్రపంచం అంతా చూస్తుండగా దొరికిన పట్ట పగలు  దొంగ రేవంత్ అని స్వయంగా సిఎం కెసిఆర్ చెప్పారు మరి ఛార్జ్ షీట్ వేసిన కేసులో దేనికి సాక్షుల విచారణ సాగుత లేదన్నారు .నేను కొట్టినట్టు చేస్తా,  మీరు ఏడ్చినట్టు చెయ్యండి అని కాంగ్రెస్ నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కనిమొళి, రాజా మీద కేసులు ఈడి, సిబిఐలు కేసు పెట్టాయి కదా, అది మీ కాంగ్రెస్ సర్కారు చేయించింది కదా, దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News