Monday, March 10, 2025

ప్రతిపక్ష భేటీకి కాంగ్రెస్ హాజరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పాట్నాలో ఈ నెల 12న జరిగే ప్రతిపక్ష పార్టీల భేటీకి కాంగ్రెస్ కూడా హాజరవుతుంది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి జై రాంరమేష్ గురువారం తెలిపారు. పార్టీ తరఫున ఈ భేటీకి ఎవరు వెళ్లుతారనేది ఇంకా నిర్ణయించుకోలేదని, దీనిని త్వరలో తెలియచేస్తామని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో సంఘటిత రీతిలో తలపడే దిశలో ప్రతిపక్షాల కీలక సమావేశాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. పార్టీ అధ్యక్షులు ఖర్గే స్వయంగా ప్రతిపక్ష భేటీకి వెళ్లాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని రమేష్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News