Friday, December 20, 2024

బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్టోబర్ 10వ తేదీన షాద్‌నగర్‌లో బిసి డిక్లరేషన్ సభకు కర్ణాటక సిఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా వస్తున్నారని విహెచ్ సోమవారం వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని అందులో భాగంగానే బిసి సభ నిర్వహిస్తున్నామన్నారు.

బిసి సబ్ ప్లాన్, కుల గణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలు రాజకీయ ప్రాధాన్యం తదితర అంశాలపై ఈ సభ ద్వారా పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బిసిలు అండగా ఉంటేనే పార్టీ విషయం సాధిస్తుందన్నారు. బిసిలకు జనాభా ధామాషా ప్రకారం నిధుల కేటాయింపు జరగాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News