Monday, January 27, 2025

తెంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బిసి డిక్లరేషన్ సభ నిర్వహిస్తోంది. బిసి డిక్లరేషన్ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోదండరామ్, నారాయణ, చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ  బిసి డిక్లరేషన్ ను ప్రకటించింది. అనంతరం సిద్ధరామయ్యా మాట్లాడుతూ…. బిసి సబ్ ప్లాన్ అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామన్నారు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల, బిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్ పై పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మరో చోట కూడా పోటీ చేస్తున్నారు. సిఎం కెసిఆర్ కూడా రెండు చోట్లా పోటీ చేస్తున్నారని వెల్లడించారు. రెండు చోట్లా రేవంత్ రెడ్డి, కెసిఆర్ పై భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డి గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. సిఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని సిద్ధరామయ్య ఆరోపించారు. కెసిఆర్ ను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఓటుతో కెసిఆర్ ను ఇంటికి పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News