Thursday, January 23, 2025

కాంగ్రెస్ తీరు సరికాదు : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనలు.. ప్రకటించిన అభివృధ్ది కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని.. అందుకే ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసి అక్కసు వెల్లగక్కుతోందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా… ఎందుకు మీ అక్కసు? కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అభివృధ్ధి చేసినందుకా.. అని ప్రశ్నించారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకా.. మహిళలకు చట్ట సభల్లో గౌరవ హోదా దక్కేలాగా రిజర్వేషన్లు తీసుకొచ్చినందుకా.. కృష్ణా నీటి వాటా పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకా..? అని ప్రశ్నించారు.

లక్షలాది మంది గిరిజన బిడ్డలకు న్యాయం చేసేలా రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నందుకా? లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నందుకా? రూ 30వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపడుతున్నందుకా మీ అక్కసు? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలను రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన తీరును మార్చుకోవాలని కోరారు. ఎవరెన్ని అవాకులు చెల్లినా, కుట్రలు పన్నినా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం తధ్యం ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్న ఆదిలాబాద్ జన గర్జన సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News