Wednesday, January 22, 2025

కర్ణాటలో విజయం.. తెలంగాణలో జోష్

- Advertisement -
- Advertisement -

కర్ణాటలో కాంగ్రెస్ విజయంతో.. రాష్ట్ర కాంగ్కెస్‌లో సంబరాలు
తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కాంగెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచి, విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యలయంలో గాంధీభవన్‌లోను సంబరాలు మినంటాయి. నాయకులు మిఠాయీలు పంచి ఆనందం పంచుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధకారంలోకి వస్తుందని టిపిసిసి ఇంచార్జి మానిక్ రావ్ ఠాక్రే అన్నారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో ప్రుభావం చూపుతాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్ణాటక బిజెపికి ఈ ఫలితాలు చెంపపెట్టు అని ఆయనన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఇగోలు పక్కకు పెట్టాలని కోరారు.

2024లో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ 2024లో 1980 చరిత్ర పునరావృత్తమవుతుందని అన్నారు ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసింది. ఏం చేయబోతోంది చెబుతామన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ నియంతృత్వానికి, అహంకారాన్ని కర్ణాటక ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. కర్ణాటక నేతల మధ్య గ్యాప్ ఉన్నా అందరు కలిసి కట్టుగా పనిచేశారని తెలిపారు. తెలంగాణలోనూ ఈ పంథా కొనసాగించాలని సూచించారు. అన్ని వర్గాలు మతతత్వానికి వ్యతిరేకంగా బిజెపిని, ఓడించాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News