Monday, January 13, 2025

కాంగ్రెస్, బిజెపి నేతలను పేటచెరువులో ముంచాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Congress BJP Leaders sink in Peta Lake

సిద్దిపేట: ఇవాళ చేపల పిల్లలను వదిలామని, కానీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కింద నీళ్లు లేక చెరువులు ఎండిపోయేవని, బోర్లు వేసి, మోటార్లు పెట్టి, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100 శాతం సబ్సిడీపై గ్రామ ఊర – పెద్ద చెరువులో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చేప పిల్లలను వదిలారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా సిఎం కెసిఆర్ దయతో నిండుగా ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బిజెపి నేతలను పేటచెరువులో ముంచాలని మంత్రి చురకలంటించారు.

భారతదేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పింది…. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనన్నారు. వ్యవసాయానికి గతంలో నీళ్లు లేక ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండటంతో కూలీలు దొరకడం లేదని, బీహార్ నుంచి కూలీలొచ్చి వరి నాట్లు వేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయేవని, ఇవాళ ఆ రోజులు మారిపోయి సీన్ రివర్స్ అయ్యిందని, కానీ బిజెపి, కాంగ్రెస్ నేతలకు కనపడటం లేదని ఎద్దేవాచేశారు. ఆ కనపడని కాంగ్రెస్, బిజెపి నాయకులను పేట చెరువులో ముంచాలని మంత్రి విమర్శించారు.

బీడీలు వద్దని కాంగ్రెస్ చెప్పిందని, పుర్రె గుర్తుపై బిజెపి 28 % శాతం జిఎస్ టి పెట్టిందని, దేశంలోని ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు రూ.2016 పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు మన సిఎం కెసిఆర్ అని తెలిపారు. గ్రామాభివృద్ధికై దశల వారీగా కృషి చేస్తామని, ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే అన్నీ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బద్ధిపడగ నుంచి సిద్ధిపేట వరకూ.. రాజ్ గోపాల్ పేట మీదుగా నాలుగు లేన్ల రహదారి వేసి బట్టర్ ఫ్లై బల్బులు అమర్చుతామని స్పష్టం చేశారు. సిద్ధిపేట సర్కార్ దవాఖానలో అన్నీ రకాల వైద్య సేవలు, వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని హరీష్ పేర్కొన్నారు. దసరా పండగ తరువాత రెండు పడకల గదుల నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News