Monday, December 23, 2024

కాంగ్రెస్, బిజెపివి చిల్లర రాజకీయాలు: మంత్రి నిరంజన్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Congress-BJP retail politics: Minister Niranjan Reddy

హైదరాబాద్: ఢిల్లీ ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు సాయం అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులకు రూ.3 లక్షల సాయంపై కాంగ్రెస్, బిజెపివి చిల్లర రాజకీయ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటికే 80,755 రైతు కుటుంబాలకు బీమా సొమ్ము అందిందని మంత్రి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి బీమా పథకం లేదన్నారు. రైతు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి అమలు చేస్తున్న గొప్ప పథకమన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో ప్రజలు ఆ పార్టీని పక్కనపెట్టారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News