Sunday, January 19, 2025

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ స్టేడియం తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేయడంతో ఇంటి స్థలం కేటాయిస్తామని, టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామని స్పష్టం చేశారు. శాసన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో త్వరలో క్రీడా విధానం తీసుకొస్తామని, హర్యానా క్రీడా విధానం పరిశీలిస్తున్నామని, త్వరంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని, స్పోర్ట్ పాలసీపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో మరో క్రికెట్ మైదానం వస్తుందని, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, సరూర్‌నగర్ స్టేడియాల్లో క్రీడలు తగ్గాయని, ఎల్‌బి స్టేడియంలో క్రీడలు తగ్గడంతో పాటు రాజకీయ కార్యకలాపాలు పెరిగాయన్నారు. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం తీసుకొస్తామని, స్కిల్ యూనివర్సిటీ సమీపంలో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని, బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బిసిసిఐతో చర్చలు జరిపామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామని, హర్యానా తరహాలో క్రీడాకారులను పోత్సహిస్తామన్నారు. భూముల లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామని, తెలుగువర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News