Wednesday, January 22, 2025

హైదరాబాద్‌కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్సే : మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌కు మెట్రో తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వైఎస్ రాజవేఖర రెడ్డి హాయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మూడు ఫేజులలో మెట్రో నిర్మిస్తామని చెప్తున్న ప్రభుత్వం నిధులు ఎక్కడ నుంచి తెస్తారో చెప్పడం లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండిపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కొందరు అధికారులు అధికార పార్టీ కార్యకర్తలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్‌విఎస్ రెడ్డి కాంగ్రెస్ పుణ్యమా అని మెట్రోరైలు ఎండి అయ్యారని మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఓ వైపు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే. హెల్త్ డైరెక్టర్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నారని, ఇంకా చాలా మందికి రైతు బందు ఇవ్వలేదని, ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. డబ్బులు లేవంటూనే ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ప్రజల ఓట్ల కోసమే మెట్రో పొడగింపు అని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News