Monday, January 20, 2025

అచ్చంపేటలో అర్థరాత్రి ఉద్రిక్తత.. గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతారణం నెలకొంది.. అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన వాహనంలో నగదు తరలిస్తున్నారంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రికత్త చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గువ్వల బాలరాజు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే ఎస్కార్ట్ గన్ మెన్లు, పోలీసులు తమ కార్యకర్తలను దూషిస్తూ దాడి చేశారని.. కానీ తమపైనే కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని నాటకమాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ కృష్ణ ఆరోపించారు. ప్రస్తుతం అచ్చంపేటలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మొహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News