Tuesday, December 24, 2024

బిఎస్పీతో జత కట్టేందుకు హస్తం ఆరాటం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు విజయం సాధించేందుకు ఎన్నికల వ్యుహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి పోతులతో పోరాటం చేసేందుకు నడుం బిగిస్తున్నాయి. అధికారం కోసం సిద్దాంతాలు పక్కకు పెట్టి జత కట్టేందుకు సిద్దమైతున్నాయి. ఎవరికి వారే ఒంటరిగా ఎన్నికల పోరులో నిలబడితే ముచ్చటగా మూడోసారి గులాబీ పార్టీకే కుర్చీ దక్కుతుందని పేర్కొంటూ ఈసారి అందరికలిసి పోటీ చేసి బిఆర్‌ఎస్ ఓడిద్దామని ఆయా పార్టీల పెద్దలు సూక్తులు వల్లిస్తున్నారు. రాజకీయాల్లో అపార అనుభవం కల్గిన, బిఆర్‌ఎస్ చీప్ కెసిఆర్ ఇప్పటికే పార్టీ విజయంపై పార్టీ నాయకులకు తగిన దిశా నిర్ధేశం చేశారు. నెల రోజుల నుంచి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి తమకే అధికారం కట్టబెట్టాలని కోరుతున్నారు. మొన్నటివరకు గ్రూపులు, అసమ్మతితో కొట్టుమిట్టాడుతున్న విపక్ష కాంగ్రెస్ కర్నాటక ఎన్నికల తరువాత పార్టీలో జోష్ పెరిగింది.

గతంలో పార్టీని వీడిన నేతలంతా సొంతగూటికి రావాలని కోరుతూ వారి ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన విబేధాలు పక్కపెట్టి అధికారం కైవసం చేసుకునేందుకు ఐక్యంగా ఉండాలని పేర్కొంటున్నారు. బిఆర్‌ఎస్ పార్టీని ఢీకొనాలంటే తమతో కలిసి వచ్చే పార్టీలో పోటీ చేసేందుకు హస్తం పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నెల రోజుల కితం తెలంగాణ జనసమితితో ఆపార్టీ నాయకులు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. పొత్తు విషయంపై ఆపార్టీ చీప్ కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసేందుకు తమ పార్టీకి చెందిన నాయకులతో చర్చించి త్వరలో తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రాష్ట్రంలో కొంత ప్రభావం చూపుతుండటంతో ఆమె సొంతంగా పొటీ చేస్తే కాంగ్రెస్ ఓట్లకు గండికొడుతుందని ముందుగానే ఆమెను కాంగ్రెస్‌లో పార్టీ చేరేందుకు ఆపార్టీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. త్వరలో షర్మిలా కూడా తమ పార్టీని కాంగ్రెస్‌లో వీలైనం చేస్తుందని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇకా రాష్ట్రంలో బిసి,ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను ప్రభావితం చేసే బహుజన సమాజ్ పార్టీ కూడా పలు ఎన్నికల్లో పోటీ చేసి ఒకటి రెండు చోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకుంది. ఆపార్టీకి మాజీ ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో రోజు రోజుకు ఆపార్టీ బలోపేతం కావడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు దీటుగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్లు బావిస్తూ ఆపార్టీతో జత కట్టేందుకు సిద్దమైతున్నారు. వచ్చే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఉంటే మరోసారి సిఎంగా కెసిఆర్ అధికార చేపడుతారని అంచనా వేస్తూ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బిఎస్పీతో కలిస్తే 25 నుంచి 30 నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చని భావిస్తూ, తమతో కలిసి పనిచేయాలని కోరేందుకు హస్తిన పెద్దల ద్వారా ఆపార్టీ అధ్యక్షురాలు మాయావతితో చర్చలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు జత కట్టి ఎన్నికల సమరంలో పోరాటం చేసేవారు. ప్రస్తుతం క్రామేడ్లు గులాబీ పార్టీతో సఖ్యతగా ఉన్నాయి. అవి తమవైపు రావని భావించి కాంగ్రెస్ నాయకులు టిజెఎస్, బిఎస్పీలతో కలిసి బిజెపి,బిఆర్‌ఎస్‌పై రాజకీయ యుద్దం చేసేందుకు సిద్దమైతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కువ పార్టీలు పోటీచేస్తే గులాబీ పార్టీ సులువుగా మూడోసారి విజయకేతనం ఎగురవేస్తుందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News