ప్రచారంలో అభ్యర్థులు రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటారు. ఓట్ల కోసం అమ్మా, అక్కా అంటూ దండాలు పెట్టడం, టిఫిన్ సెంటర్ కి వెళ్లి దోసెలు వేయడం వంటివి చేస్తారు. ఓ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం తన గెలుపుకోసం చెప్పు దెబ్బలు కొట్టించుకున్నాడు. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మధ్యప్రదేశ్ లోని రత్లాం నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ టిక్కెట్ పై పరాస్ సాక్లేచ్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో చేయాల్సినవన్నీ చేశాడు. ఓటర్ల కాళ్లూ గడ్డం పట్టుకుని తనకే ఓటు వేయమంటూ ప్రాధేయపడ్డాడు. తీరా పోలింగ్ రోజు రానేవచ్చింది. శుక్రవారం పోలింగ్ మొదలుకాగా, సాక్లేచ్ ఓ కొత్త చెప్పుల జత కొన్నాడు. వాటిని తీసుకుని రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నివసించే ఫకీర్ బాబా దగ్గరకు పోయాడు. ఈ బాబా చేత కొట్టించుకుంటే, విజయం తథ్యమని చుట్టుపక్కలవారు నమ్ముతారు. అందుకని తాను కొన్న చెప్పుల జతను బాబా చేతికి ఇచ్చి, కొట్టమన్నాడు. బాబా ఆ చెప్పులు తీసుకుని ముందుగా సాక్లేచ్ తలపైన, ఆ తర్వాత చెంపలపైనా, చేతులపైనా వాయించాడు. బాబా అలా కొడుతుంటే, సాక్లేచ్ నవ్వుతూ కొట్టించుకున్నాడు. ‘అమ్మయ్య, ఇక నా గెలుపు ఖాయం’ అనుకుంటూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి బయల్దేరాడు సాక్లేచ్.
रतलाम कांग्रेस पार्टी प्रत्याशी पारस सकलेचा।
चुनाव जीतने के लिए चप्पल का प्रसाद 🤭
कांग्रेस ही ये कर सकती है। 🤣@AlokTiwari9335 😁 pic.twitter.com/RaqdtNESkN— Deepak Lahiri ✍️ (@DeepakLahiri5) November 17, 2023