Monday, December 23, 2024

అదిష్టానం కన్ను ఎవరి వైపో..?

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ ః కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఓకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటా అలాంటిది, తెలంగాణ ఉద్యమం తర్వాత పరిణామాలు మారాయి. నాటి పాలన గుర్తులు యాది చేసుకోని బడుగు బలహీనవర్గాల వారితో పాటు ఇతరులు సంక్షేమ పథకాలు ఇచ్చిన కాంగ్రెస్‌ను యాదిపెట్టుకోని నాటి నుండి ఆ పార్టీకి బాసటగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంపై అయ పార్టీల నేతలకన్ను గట్టిగానే ఉండేది. తెలంగాణ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమానికి తేర లేపడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఉద్యమానికి మద్దతు తెలిపి టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారు. 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితిని ఎర్పాటు చేయడంతో ఉద్యమం ప్రారంభం అయింది. దాంతో నియోజక వర్గ ప్రజలు తెలంగాణకు మద్దతుగా 2004 నుండి 2018 వరకు టీఆర్‌ఎస్ పార్టీ ఎనుగు రవిందర్‌రెడ్డికి పట్టం కట్టారు మద్యలో 2008 బై ఎన్నికలలో 6 నెలలు కాంగ్రెస్‌కు పట్టం కట్టినాడు బి. జనార్దన్‌గౌడ్ ను ఎమ్మెల్యేగా గెలిపించారు.

అనంతరం 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి జాజాల సురేందర్, టిఆర్‌ఎస్ నుండి ఎనుగు రవిందర్‌రెడ్డి, బిజెపి నుండి బాణాల లకా్ష్మరెడ్డి ఇతర ఇండిపిండెంట్ నాయకులు పోటీలో ఉన్నారు. 2018 ఎల్లారెడ్డి ఎన్నికలలో కోన్ని ఉత్కంఠ వాతవరణంలో వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిని ఓప్పించి షబ్బీర్ అలీ నాయకత్వంలో అప్పటికప్పుడు చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జాజాల సురేందర్‌కు టికెట్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా జహిరాబాద్ ఎంపి అభ్యర్థిగా మదన్‌మోహాన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుండి జాజాల సురేందర్ గెలుపోందారు. ఎంపి అభ్యర్థి అయిన మదన్‌మోహాన్ బీబీ పాటిల్ చేతిలో స్వల్ప మోజార్టీతో ఓటమి చెందారు. తాంతో ప్రభుత్వం టీఆర్‌ఎస్ రావడంతో జాజాల సురేందర్ పార్టీని విడచి ప్రభుత్వంలో చేరారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అన్నట్లు వడ్డేల్లి సుబాష్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావులు పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లు గా మారిపోయారు. ఎవరికి వారే యాత్రలు, సమీకరణలు చేసుకుంటున్నారు. ఎల్లారెడ్డిలో రేవంత్‌రెడ్డి సభలో సైతం ఇరువర్గాలు ఘర్షనలకు దారితీశాయి, అనంతరం రాజంపేట్ మండలంలో ఎల్లారెడ్డిపల్లి , లింగంపేట్ మండలంలో రెండు వర్గాలు వారు దాడులు చేసుకోని కేసులు కూడా పెట్టుకున్నారు.
ఎవరిదారి వారిదే…….దీమా సైతం వారిదే
కాంగ్రెస్ పార్టీ అదిష్టానం ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఎవరిదారి వారిదే అన్నట్లుగా మారింది ఎల్లారెడ్డి కాంగ్రెస్ పరిస్థితి. వడ్డేపల్లి సబాష్‌రెడ్డి, మదన్ మోహన్ రెండు వర్గాలుగా చీలి ఎవరి కార్యకర్తలు వారిని టీం లుగా చేసుకోని నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రోజువారి కార్యక్రమాలు చేస్తున్నారు. సుబాష్‌రెడ్డి స్వచ్చంద కార్యక్రమాలతో పాటు వైద్యాసేవలు, ఉచిత అంబులెన్స్, ఉచిత బస్సు సౌకర్యం, ఆర్థిక సహాయం, పరామర్శలు వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు సైతం ఇద్దరు ఎర్పర్చుకున్నారు. మదన్‌మోహన్ కూడ వైద్యసేవలు, స్వచ్చంద కార్యక్రమాలు, ఉచిత అంబులెన్స్‌లు, తో పాటు ఈ పాటికే నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బిందెలు పంచారు.

అలాగే కరోణ సమయంలో అక్సీజన్ కిట్లు అందించి ఎంతో మందికి ప్రాణాలు పోశారు. ఆర్థిక సహాయాలు, పరామర్శలు ఇద్దరు కూడ స్వచ్చంద కార్యక్రమాలు చేస్తున్న ప్రజలు కార్యకర్తలు మాత్రం ఎవరివైపు ఉండాలి అన్న అలోచనలో ఉన్నారు. ఇటివల గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో కూడ ఇద్దరు వెర్వేరుగా చేశారు. పార్టీ ఓక్కటే అయిన వర్గాలు రెండు కావడంతో ఎమి తోచని పరిస్థితి నెలకోంది నియోజకవర్గంలోని కార్యకర్తలది. ఇద్దరు కలసి పని చేస్తే తాము పార్టీకి మరింత చేరువావుతామని పార్టీకి పూర్వ వైభవం తెవచ్చని కార్యకర్తలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇద్దరు ఇద్దరే….. మరి టికేట్ ఎవరికి..?
2124 ఎన్నికలలో నాకే టికేట్ అంటు ఇద్దరు సైతం అశభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకరు సీనియర్ నేత అండదండలున్నాయని మరోకరు రాష్ట్ర స్థాయి నాయకుల అండ ఉందని చెప్పుకుంటున్నారు. గతంలో నుండి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి రెవంత్‌రెడ్డి అనుచరుడుగా, షబ్బీర్‌అలీ బంటుగా ఉంటు వారి సహాకారంతో నియోజకవర్గంలో ఫలు కార్యక్రమాలు చేస్తున్నారు. తనకే టికెట్ ఖాయం అని దీమాతో ఉన్నారు. టిడిపి నుండి రేవంత్‌తో ప్రయాణం సాగించారు. మదన్ మోహన్ కూడా పార్లమెంట్ స్థానం వదిలి ఎల్లారెడ్డిపై కన్నెశారు. అయన కూడా పార్టీ పెద్దతో మరియు మాజీ క్రికెటర్ మాజీ ఎంపి సీనియర్ నాయకులు ఆజారోద్దిన్ తో సంబందాలు ఉన్నాయి . ఫలుమార్లు అయనను కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో సమావేశాలకు తీసుకోచ్చారు.

ఇటివల సోషల్ మీడియాలో మదన్‌మోహన్‌కు టికేట్ అధిష్టానం కేటాయించినట్లు వైరల్ అవుతున్నాయి. కాదు అది అంత ఫేక్ అని తమకే టికెట్ అంటు వడ్డేపల్లి వర్గం అంటోంది మరి టికెట్ ఇవరికి ఇస్తుందోనని కార్యకర్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2108 మాదిరిగానే ఎంపిగా మదన్ మెహన్‌కు ఇచ్చి ఎమ్మెల్యేకు వడ్డేపల్లికి ఇస్తారా అన్నది చర్చనీయంగా మారింది. కాని మదన్‌మోహన్ ఎంపికి ఉత్సహాం లేనట్లు కనిపిస్తుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం మీదనే కన్నెసినట్లు సమాచారం. మరి అదిష్టానం ఆదేశాలతో ఇద్దరు కలుస్తారా? పార్టీని ఓకటిగా చేస్తారా? అన్న ప్రశ్న కార్యకర్తలలో మిగిలింది. మరి పార్టీల పరిస్థితులు, కండువాలు మారుడు టికేట్ల కేటాయింపు, ఏ పార్టీలలో ఎవరుంటారు. సమీకరణలు ఎలా ఉంటాయో మరో రెండు నెలలు వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News