Sunday, January 19, 2025

కర్నాటకలో రోడ్డు ప్రమాదం: కాంగ్రెస్ అభ్యర్థికి గాయాలు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కర్నాటకఅసెంబ్లీ ఎన్నికల్లో గుర్మిత్కల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న బాబూరావు చించన్సూర్ శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు కలబురగి జిల్లాలో బోల్తపడింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు కారు డ్రైవర్, గన్‌మ్యాన్ కూడా గాయపడ్డారు.

యాద్గిర్ నుంచి కలబురగి తిరిగివస్తుండగా కారు డ్రైవర్ స్టీరింగ్‌పై అదుపుతప్పి రోడ్డు పక్కనున్న స్తంఢాన్ని ఢీకొట్టబోయి తప్పించే ప్రయత్నంలో మరో పక్కకు తిప్పగా కారు బోల్తాపడినట్లు సమాచారం అందింది. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బిజెపి ఎంఎల్‌సిగా ఉన్న చించన్సూర్ త నెల ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News