Monday, December 23, 2024

రూ.100 కోట్ల పైచిలుకు క్లబ్‌లో ఆరుగురు అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బిజెపి నుంచి ఒక్కరు, బిఆర్‌ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ పక్కా వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార జోరును పెంచాయి. 119 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో రూ.100కోట్లకు పైబడి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యధిక సంపన్న ఎమ్మెల్యేలు మన దగ్గర ఉన్నారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలిస్తే మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు రూ.100 కోట్లకు పైబడి ఉన్నారు. ప్రధాన పోటీ అధికార బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్యనే నెలకొనగా, మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి ఆరుగురు అభ్యర్థులు తమ ఆస్తులు 100 కోట్ల పైబడి ఉన్నట్లు ప్రకటించారు. అధికార బిఆర్‌ఎస్ పార్టీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి రూ.100 కోట్ల క్లబ్‌లో ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ రూ.606 కోట్లు
దుబ్బాక బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనకు రూ.197 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించగా, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి రూ.112 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఇక భువనగిరి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి అధికారికంగా తనకు రూ.277 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. ఇక బిజెపి నుంచి కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ తనకు రూ. 106 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.100 కోట్ల పైబడి ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అందులో మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు రూ.458 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించగా, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ తనకు రూ.606 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News