Sunday, January 19, 2025

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

పలు అంశాలపై చర్చ
భారీగా తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు
రేవంత్ ఇంటి వద్ద భద్రత పెంపు

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. శుక్రవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్‌తో పాటు మరికొంత మంది అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని రేవంత్ రెడ్డికి వివరించారు. ఇదే సమయంలో ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరించాలన్న ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కూడా ఈ భేటీలో నేతల మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా చాలా చోట్ల రాత్రి వరకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఆ స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. పోలింగ్ శాతం గెలుపు, ఓటములు ఎలా ఉండబోతున్నది వారు విశ్లేషించుకుంటున్నారు.

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా…
ప్రస్తుతం హైదరాబాదులోని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంచారు. ఆయన ఇంటికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు భారీగా తరలివస్తుండడంతో గతంలో కంటే అధిక సంఖ్యలో పోలీసులు రేవంత్ ఇంటి వద్ద శుక్రవారం మోహరించారు. ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News