Monday, January 20, 2025

సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ కుట్ర

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రె డ్డి కుట్రలు చేస్తున్నాడని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా విమర్శించారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న విద్యుత్ భవన్ ఎదుట గురువారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి తీరును మంత్రి దుయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్ల రైతుకు ఎన్నడూ ప్రయోజనం చేకూరలేదని, వారి పాలనలో కరెంటు లేక రైతు ఆగమైందని అన్నారు.

పగటిపూట మూడు గంటలు రాత్రిపూట మూడు గంటలు మాత్రమే కరెంటు ఇచ్చి అన్నదాత ఆగమయ్యేలా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ము డా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, జిల్లా గొర్రె కాపరుల సహకారం సంఘం అధ్యక్షులు శాంతన్నయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ , రైతు బంధు సమితి ప ట్టణ అధ్యక్షుడు గొనేల రాములు, వివిధ మండలాల బిఆఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News