Sunday, January 19, 2025

కాంగ్రెస్ కులగణన రాజకీయం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ ఎన్నికల సభలో నడ్డా

ఛింద్వారా : కాంగ్రెస్ పార్టీ చివరికి దేశంలో కుల జనగణనను కూడా రాజకీయం చేస్తోందని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. కులగణనకు బిజెపి ఎప్పుడూ అడ్డు చెప్పలేదే. అయితే కాంగ్రెస్‌కు ఈ ప్రక్రియ పట్ల చిత్తశుద్ధి లేదని , దీని ద్వారా సమాజాన్ని విడగొట్టి లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ నేత శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో జరిగిన సభలో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం జ్ఞానులు, గరీబులు, యువజనులు, అన్నదాతలు రైతులు, నారీశక్తి సాధికారికతకు పట్టం కట్టిందని నడ్డా తెలిపారు.

ఈ విధంగా అన్ని వర్గాల అభ్యున్నతితోనే దేశం ప్రగతి సాధ్యం అవుతుందన్నారు. ప్రధాని మోడీ రాకతో కాంగ్రెస్‌కు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. వారి ఆటలు సాగడం లేదని, ఇంతకు ముందటి రాజకీయాలను మోడీ మార్చివేశారని తెలిపారు. ఇంతకు ముందు రాజకీయాలు కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా చలామణి అయ్యేవి, ఇప్పుడు ఆ పద్థతి మారిందని నడ్డా వివరించారు. సామాజిక విభజనలతో కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ముల నడుమ చిచ్చులు పెట్టిందని చెప్పారు. ఇప్పుడు స్వార్థపూరిత రాజకీయాలకు కాలం చెల్లింది.

కేవలం ప్రగతిదాయక రాజకీయాలకే విలువ పెరిగింది. అభివృద్ధి కేంద్రీకృతం అయిన ప్రక్రియలో ప్రజలు తమకు తాముగా ఈ ప్రక్రియలో అంతర్లీనం అవుతున్నారని తెలిపారు. ఇంతకు ముందు రాజకీయాలకు గీటురాయి కేవలం ఓటుబ్యాంకులు, ఓ వర్గం మెచ్చుకోళ్లపై ఆధారపడి ఉండేదని, ఇప్పుడు తీరు మారింది. పనితీరు సంబంధిత రిపోర్టు కార్డు, బాధ్యతల నిర్వహణలో కట్టుబాట్లకు ప్రాధాన్యత ఉందని నడ్డా చెప్పారు. ప్రధాని మోడీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. వీటితో దేశంలో దీర్ఘకాలిక సందిగ్థతలకు తెరపడిందని చెప్పారు. 2014కు ముందు భారత్ అంటే అవినీతి అనే అప్రతిష్ట ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పలు ఘనతలతో ప్రతిష్ట పెరిగిందని ఆయన మోడీ సర్కారును కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News