Friday, September 27, 2024

రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: ఏలేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైతు రుణమాఫీపై సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిఎం పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందిని అంటున్నారని, కానీ మంత్రులు ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందని అంటున్నారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ అమలు కోసం ఈ నెల 30న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బిజెపి నేతలు సాధన దీక్ష చేయనున్నారు. ఈ నెల 30న ఉదయం 11 నుంచి 24 గంటల పాటు బిజెపి నేతలు దీక్ష చేయనున్నారు. ఈ సభ స్థలాన్ని శుక్రవారం ఉదయం మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై బిజెపి పోరాడుతూనే ఉంటుందని ఏలేటి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి, కిసాన్ మోర్చ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఇందిరా పార్కు దగ్గరలోని ధర్నా చౌక్ లో స్థల పరిశీలన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News