Friday, December 20, 2024

కెటిఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కెటిఆర్ పై ఎన్నికల కమిషన్ కి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కెటిఆర్ పై ఫిర్యాదు చేశారు. దీక్షా దివాస్ నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని కాంగ్రెస్ ఆరోపించింది. సీఈవో వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. కెటిఆర్ ప్రకటన మీడియాలో కూడా వచ్చిందని నిరంజన్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ కార్యాలయంలో రక్తదానం చేయడాన్ని కూడా కాంగ్రెస్ ప్రస్తావించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కెటిఆర్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News