Sunday, December 22, 2024

పాతబస్తీలో రిగ్గింగి జరిగింది..ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

పాతబస్తీలోని పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సీఈఓ వికాస్ రాజ్ కు నిన్న(గురువారం) రాత్రి ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో 70శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

పాతబస్తీలోని చంద్రాయగుట్ట, చార్మినార్, బహదూర్ పుర స్థానాల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ నిరంజన్, సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు.ఎంఐఎం కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పరిశీలించాలని.. రిగ్గింగ్ జరిగిన స్థానాల్లో రీపోలింగ్ జరపాలని కాంగ్రెస్ ఈసీని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News