Sunday, November 17, 2024

బిజెపి గూండాల దాడికి భయపడం: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్రపై బిజెపి గూండాలు జరిపిన దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దేశ ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, న్యాయాన్ని హరించి, ధ్వంసం చేయడానికి అస్సాంలోని అధికార బిజెపి పూనుకుందని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. అస్సాంలోని లఖింపూర్‌లో భారత్ జోడో న్యాయ యాత్రకు చెందిన వాహనాలపై బిజెపి గూండాలు దాడి చేసి కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను, పోస్టర్లను చింపివేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ తెలిపింది. భారత ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, న్యాయాన్ని హరించివేసి, ధ్వంసం చేయడానికి గత పదేళ్లుగా బిజెపి ప్రయత్నస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడం ద్వారా ప్రజల గొంతును నొక్కాలని బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

భారత్ జోడో న్యాయ యాత్రపై జరిగిన దాడికి అస్సాంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ రకమైన దాడులకు, వేధింపులకు కాంగ్రెస్ బెదిరిపోదని ఆయన స్పష్టం చేశారు. దాడికి సంబంధిన వీడియోను పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అత్యంత అవినీతిపరుడైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ భారత్ జోడో న్యాయ యాత్రను చూసి ఎంతగా భయపడుతున్నారో ఇదే సాక్షమని చెప్పారు. న్యాయ యాత్ర ప్రజలలో చూపుతున్న ప్రభావాన్ని చూసి భయపడిపోయిన హిమంత ఎంతకైనా దిగజారుతారని తెలియచేయడానికి బిజెపి గూండాలు చేసిన దాడే నిదర్శనమని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News