Wednesday, January 22, 2025

మంత్రి కొప్పుల వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తోంది : ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దళిత డిక్లరేషన్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. దళిత సంక్షేమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనేనని, దళితులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.

గాంధీభవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లల్లో తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్న ఊళ్లలో బిఆర్‌ఎస్ నాయకులు ఓట్లు అడగాలన్నారు. గత మూడేళ్ల ఎంత మందికి దళిత, బిసి, మైనార్టీ బంధు ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం కాదనీ, ఎస్సీ సంక్షేమంలో జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News