Wednesday, January 22, 2025

ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ కుట్ర

- Advertisement -
- Advertisement -

ముత్తారం: మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్న ప్రభుత్వంపై ఒర్వలేక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై మాజీ ఎంపీపీ, రైతుబందు మండల అధ్యక్షుడు అత్తె చంద్రమౌళి ఆధ్వర్యంలో బుధవారం రైతు వేదిక వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ ముత్తయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూడు గంటల కరెంటు చాలన్న రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సమాధి కట్టాలని అన్నారు. 24 గంటల కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు.

రైతులు ఎవరి పక్షాన ఉంటారో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. మూడు పంటలకు నీళ్లు, కరెంటు కావాలో, మూడు గంటలు కాంగ్రెస్ ఇచ్చే కరెంటు కావాలో తేల్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సుదాటి రవీందర్ రావు, సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు నూనె కుమార్, సర్పంచ్‌లు వేల్పురి సంపత్, బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు రాగుల సతీష్, ఎంపీటీసీ బియ్యని శ్యామల సదానందం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కూరాకుల ఓదెలు, పప్పు చంద్రమౌళి, బేద సంపత్, ఇల్లందుల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్లు, పాపయ్య,

ఉపసర్పంచ్‌లు జంగా తిరుపతిరెడ్డి, దేవునూరి బాను కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు జంగ వెంకట్ రెడ్డి, మాదాసి రమేష్, నరెడ్ల రమేష్, నీరటి రవి, దొడ్ల రవి, ఉట్ల శ్రీను, నిమ్మతి రమేష్, రైతుబందు కన్వీనర్ ఎర్ర రవీందర్, రైతుబందు మండల సభ్యులు బాపురెడ్డి, బీఆర్‌ఎస్ సంయుక్త కార్యదర్శి కాసు సదానందం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News