Monday, December 23, 2024

ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్

సంగారెడ్డి: రైతులకు ఉచిత కరెంట్ రద్దు చేస్తామని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లడటం సిగ్గు చేటని, రైతులు బాగుండటం కాంగ్రెస్‌కి ఇష్టం లేదని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి రైతులపై విషం చిమ్ముతున్నారన్నారు. చంద్రబాబు శిష్యరికం కాబట్టి వ్యవసాయం దండగ అని చెబుతున్నారని, రేవంత్‌రెడ్డి అణువనువు రైతులపై ఈర్శతో ఉన్నారని చెప్పారు. 70సంవత్సరాలు పాలన సాగించిన టిడిపి కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసిందేమి లేదని ఆరోపించారు.

ఉచిత విద్యుత్ ఎత్తివేయాలన్నది రేవంత్‌రెడ్డి కాదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ బొంగుల విజయలక్ష్మి,ఎంపిపి సరళ పుల్లారెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు బీరయ్య యాదవ్, విజేందర్‌రెడ్డి, నరహరిరెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి ఆత్మకూర్ నగేష్, డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి, మాణిక్ ప్రభు, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, చక్రపాణి, విఠల్, జలంధర్‌రావు, నర్సింలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News