Monday, December 23, 2024

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసే పార్టీలో చేరికలు
ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్

మన తెలంగాణ/మోత్కూరు: టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, తమతో కలిసొచ్చే వారందరినీ కలుపుకుని ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామ 3వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ లెంకల సుజాతవేణు బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. వారితో పాటు నీటి సంఘం చైర్మన్ తోట పరశురాములు, మాజీ వార్డు సభ్యులు జోగు ఎల్లయ్య, పాపయ్య, ఎస్‌ఎంసి చైర్మన్ స్వామితో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తన శాయశక్తులా పని చేస్తున్నానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కలిసి పని చేసి పార్టీ బలోపేతానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, మలిపెద్ది రజిత, కూరెళ్ల కుమారస్వామి, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్‌నాథ్, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, పట్టణ ప్రధానకార్యదర్శి గజ్జి మల్లేష్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News