Sunday, January 19, 2025

భారీ లూఠీ మీ అదానీదే… మోడీకి కాంగ్రెస్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచి చూస్తే అత్యంత భారీ, అసాధారణ లూఠీ మోడీ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అదానీ గ్రూప్ ఉన్నట్లుండి వేల లక్షల కోట్లకు పడగలెత్తడం మించిన దోపిడి మరోటి ఉంటుందా? దీనిపై ప్రధాని మోడీ జాతికి వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. ఒడిషాలో కాంగ్రెస్ ఎంపి ధీరజ్ ప్రసాద్ సాహూ నివాసంలో దాదాపు రూ 350 కోట్లకు పైగా అక్రమ నగదు పట్టుబడ్డ నేపథ్యంలో ప్రధాని మోడీ దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ రాజకీయ దోపిడి అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.

అదానీ వ్యాపారాలను ఎవరు ప్రోత్సహించారనేది అందరికీ తెలిసిందే. ఇక అదానీ ఏ మేరకు అతి తక్కువ కాలంలో ఎదిగిపొయ్యారనేది తెలుసు. ఆయనకు ఛాంగ్ ఛుంగ్ లింగ్‌కు ఉన్న లింక్‌లు వెలుగులోకివచ్చిన క్రమంలో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఎంపి విషయం ప్రస్తావిస్తున్నారని, అయితే ఈ అదానీ వ్యవహారం నుంచి ఇప్పుడు ప్రధాని తప్పించుకోవడం కుదరదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News